గుండెపోటుతో రాయలసీమ విలన్ మృతి.!

గుంటూరు.టాలీవుడ్ సీనియర్ నటుడు జయప్రకాష్ రెడ్డి కన్నుమూత. కరోనాతో షూటింగులు లేకపోవడంతో లాక్‌డౌన్‌ నుంచి గుంటూరు లోనే ఉంటున్న ఆయన... గుండెపోటుతో బాత్రూంలో కుప్పకూలారు అని కుటుంబ సభ్యులు తెలిపారు. రాయలసీమ స్లాంగ్ లో విలనిజంతో ఆయన ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. ఇప్పుడు ఆయన లేరన్న వార్తతో టాలీవుడ్ లో విషాదం నెలకొంది. జయప్రకాష్ రెడ్డి స్వస్థలం కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలం సిరివెళ్ల గ్రామం. ఈయన సినిమాల్లోకి రాకముందు ఎస్సై గా పనిచేశారు.

Leave A Reply

Your email address will not be published.